టిసిఎస్ లో ఉద్యోగాల కోత
కోలకత: ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టిన వార్తలు వింటూనే ఉన్నాం. భారత ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కూడా పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగుల ఉద్వాసనకు, జీతాల కోతకు త్వరలో శ్రీకారం చుట్టంనుంది. 'రాబోయే ఆర్ధిక సంవత్సరంలో జీతాల పెంపు ఉండదు, అదే సమయంలో ఉద్యోగాల్లో కోత ఉంటుంది' అని టిసిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రామదొరై తెలిపారు.
కంపెనీ కొత్త ఉద్యోగ నియామకాలకు స్వస్తి చెప్పిందని, సిబ్బంది జీతాల్లో వైవిధ్యమైన చెల్లింపుల అంశాన్ని ప్రవేశపెట్టే విషయంపై కంపెనీ పరిశీలిస్తోందని రామదొరై తెలిపారు. వైవిధ్యమైన వేతనాల (వేరియబుల్ పే) వ్యవస్థ ప్రకారం సిబ్బంది జీతాల వ్యత్యాసం 22-35 శాతం తేడా ఉంటుంది. అదే సమయంలో ఈ పద్దతిలో సిబ్బంది జీతాల మొత్తం టిసిఎస్ ఆదాయంలో ఎనిమిది శాతంగా ఉంటుంది. టిసిఎస్ లో ప్రస్తుతం 1,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేపెక్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి పలు పొదుపు చర్యలను కంపెనీ చేపట్టిందని రామదొరై తెలిపారు.
News Posted: 26 February, 2009
|