త్వరలో 'మొబైల్ పోర్టబిలిటీ'
న్యూఢిల్లీ: భారత నగరాల్లోను, పెద్ద రాష్ట్రాల్లోనూ మొబైల్ నెంబరు పోర్టబిలిటీ సెప్టెంబర్ నుండి అమలు లోకి వస్తుందని టెలికామ్ మంత్రి అండిముత్తు రాజ గురువారంనాడు తెలిపారు. ఏదైన ఒక నెట్ వర్క్ నుండి మరో నెట్ వర్కలోకి మారాలనుకున్న మొబైల్ వినియోగదారుడు క్రితం నెట్ వర్క్ లోని నెంబరును కోల్పోవడమన్నది ఇప్పటి వరకు జరుతోంది. అయితే టెలికామ్ శాఖ ప్రవేశపెడుతున్న మొబైల్ నెంబరు పోర్టబిలిటీ వ్యవస్థ వలన మొబైల్ వినియోగదారుడు తాను కోరుకున్న నెట్ వర్కకు మారినప్పటికీ గత నెంబరుతో సహా మారేందుకు అవకాశం లభిస్తుంది.
మొబైల్ నెంబరు పోర్టబిలిటీ (MNP) వ్యవస్థను ఏర్పాటు చేసే బిడ్డర్లను మార్చి 5న ప్రభుత్వం ప్రకటించనుందని రాజ తెలిపారు. మొబైల్ నెంబరు పోర్టబిలిటీ(MNP)వ్యవస్థను మెట్రో నగరాలన్నిటిలోను, కేటగిరి ఏ సర్వీసు ఏరియాల్లోను లైసెన్సును పొందిన ఆరు నెలల్లోపు బిడ్డర్లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో ఒక ఏడాది లోపు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుందని మంత్రి రాజా రాతపూర్వకంగా ప్రకటించారు.
News Posted: 26 February, 2009
|