ద్రవ్యోల్బణం: 3.36%
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం 15 నెలల నాటి అత్యున్నత స్థాయి 3.36 శాతానికి క్షీణించింది. దాంతో భారత రిజర్వ బ్యాంక్ (ఆర్ బిఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు అవకాశం దొరికింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగతి మందగించడంతో కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించవలసిన అవసరం ఉంది. ఆహార పదార్దాలు, మాన్యాఫాక్చర్ వస్తువుల ధరలు బాగా తగ్గాయి. మద్యం లాంటి విలాసవంతమైన వస్తువుల ధరలు మాత్రమే ఒకమేరకు పెరిగాయి. ఫిబ్రవరి 14 వారాంతానికి ద్రవ్యోల్బణం 0.56 శాతం తగ్గింది.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కృశించిపోవడం, భారత ఆర్ధికాభివృద్ధి రేటు మందగించడంతో ధరలు పడిపోయి ద్రవ్యోల్బణం క్షీణించడం జరిగిందని నిపుణులు తెలిపారు. అర్ధికాభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వడ్డీరేట్లను తగ్గించడం మినహా ప్రభుత్వానికి వేరే దారి లేదు. ఆర్ బిఐ సకాలంలో సరైన చర్యల్ని చేపడుతోందన్న ఆశాభావాన్ని ఫైనాన్స్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకర్లు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశమున్నట్లు ముఖర్జీ పార్లమెంట్ లో తెలిపారు. ఏప్రిల్-మేనాటికి దేశం ద్రవ్య సంకోఛం (డిఫ్లేషన్) సమస్యను ఎదుర్కోబోతోందని హెడిఎఫ్సి బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ అభీక్ బారువా ప్రకటించారు. ఆహారేతర వస్తువుల ముడి సరకుల ధరలు తప్ప సరకుల ధరలన్ని తగ్గాయని బారువా తెలిపారు.
News Posted: 26 February, 2009
|