ముంబై: నానో కార్లు ఏప్రిల్ మొదటి వారంలో టాటా మోటార్స్ షోరూమ్ ల్లో దర్శనమిస్తాయి. ఏప్రిల్ రెండవ వారంలో బుగింగులు ప్రారంభం కానున్నాయని టాటా మోటార్స్ కంపెనీ గురువారంనాడు ప్రకటించింది. అయితే వాహనాలను కొనుగోలుదారులకు అందించే విషయంపై కంపెనీ పెదవి విప్పలేదు.మార్చ్ 23 మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నానో కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షణ సాగింది. కంపెనీ వెబ్ సైట్ ను దాదాపు3 కోట్ల మంది పరిశీలించారు. తొలి ఏడాది 50-70 వేల వాహనాలను టాటా మోటార్స్ విడుదల చేయనున్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రారంభ ధర దాదాపు 1.2 లక్షల రూపాయలుండొచ్చు