క్షీణించిన జిడిపి
న్యూఢిల్లీ: భారత ఆర్ధికాభివృద్ది 2008-09 మూడవ త్రైసికంలో 5.3 శాతంగా నమోదైంది. కొన్ని సర్వీసు రంగాల్లో బలీయంగా ఉన్నప్పటికి మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయ రంగాలు బాగా మందగించాయి. వ్యవసాయ రంగం ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు బాగా కృశించి అక్టోబర్-డిసెంబర్ లో 2.2 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. నిరుడు ఇదే సమయంలో వ్యవసాయరంగ అభివృద్ది 6.9 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. మాన్యుఫాక్చరింగ్ తో సహా పారిశ్రామికాభివృద్ధి మూడవ త్రైమాసికంలోని అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో బాగా మందగించింది. నిరుడు ఇదే సమయంలో 8.6 శాతం వద్ధి రేటును సాధించిన మాన్యుఫాక్చరింగ్ రంగం ఈ ఏడాది 0.2 శాతం క్షీణించింది.
గత ఏడాది 5.5 శాతం కమ్మూనిటీ, సోషల్, పర్సనల్ సర్వీసెస్ రంగాలు ఈ ఏడాదిలో 17.3 సాతం వృద్ధి రేటును సాధించాయి. అందులో కొంత భాగం ప్రభుత్వోద్యోగుల జీతాల సవరణ వల్ల సాధ్యమైంది. 2007-08 మధ్యకాలంలో 9 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 6.9 శాతంగా ఉంది. అయితే మారిన ఆర్థిక పరిస్థితుల రీత్యా భారత ఆర్ధికాభివృద్ధి రేటు ఈ ఆర్ధిక సంవత్సరంలో 7.1 శాతం ఉండబోతుందని నిపుణుల అంచనా. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వచ్చే త్రైమాసికంలో ఏడు శాతానికి పైగా వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుంది.
News Posted: 27 February, 2009
|