మాంద్యం ఊబిలోకి ఐటి
బెంగళూరు: ఐటి సేవా రంగం త్వరలో మాంద్యంలోకి జారిపోనుందని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా ఐటి సంస్థల ఖాతాదారులు టెక్నాలజీపై ఖర్చు చేసేందుకు వెనకాడుతుండడంతో భారత ఐటి రంగం దెబ్బతినే ప్రమాదముందని ప్రముఖ ఔట్ సోర్సింగ్ సంస్థ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు. ఉద్యోగుల జాతాల్నిఏప్రిల్ లో పెంచేందుకు నాస్దాక్ లిస్టెడ్ ఇన్పోసిస్ సంస్థ నిర్ణయం తీసుకుందని క్రిష్ గోపాలక్రిష్ణన్ శుక్రవారంనాడు జరిగిన పారిశ్రామిక కాన్పరెన్స్ లో తెలిపారు.
ఈ మాంద్యం పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముందని గోపాలక్రిష్ణన్ తెలిపారు. ఇంగ్లీషు మాట్లాడగలగి, అత్యంత చౌకగా లభించే భారతీయ ఇంజినీర్లకు పాశ్చాత్య దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సిటీ గ్రూపు, జనరల్ ఎలక్ట్రిక్, క్వాంటాస్, ఎయిర్ బస్ లాంటి పాశ్చాత్య సంస్థలు భారతీయ ఇంజనీర్ల వైపే ప్రధానంగా మొగ్గు చూపుతున్నాయి. అమెరికాలో నెలకొన్న తీవ్ర మాంద్య పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ద్రవ్య సంక్షోభంతో భారతీయ ఐటి రంగంలో చీకట్లు కమ్ముకున్నాయి. భారత ఐటి ఆదాయంలో సగానికి పైగా అమెరికా ఔట్ సోర్సింగ్ నుండే వస్తోంది. దాంతో ఐటి రంగం కుదేలయ్యిందని గోపాలక్రిష్ణన్ తెలిపారు.
News Posted: 27 February, 2009
|