ఆర్ బిఎస్ 'రిటైల్' సేల్
న్యూఢిల్లీ: రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ ల్యాండ్ (ఆర్ బిఎస్) భారత్ దేశంలోని తన రిటైల్, వాణిజ్య వ్యాపారాలను అమ్మివేసేందుకు నిర్ణయించుకుంది.నిరుడు బ్యాంక్ కు 24 బిలియన్ పౌండ్ల వార్షిక నష్టం వాటిల్లడంతో చేపట్టిన సంస్థాగత చర్యల్లో భాగంగా ఈ వ్యాపారాలను అమ్మివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆర్ బిఎస్ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే ఈ అమ్మకాలకు సంబంధించిన వివరాలను గాని, టైమ్ ఫ్రైమ్ ను గాని ఆయన ప్రకటించలేదు. బ్యాంక్ ఆస్తి యాజమాన్య విభాగాన్ని కూడా అమ్మివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
2007లో ఎబిఎన్ ఆమ్రో బ్యాంకు స్వాధీనం చేసుకోవడంతో ఆర్ బిఎస్ భారత్ లోకి అడుగు పెట్టింది. భారత్ దేశంలో ఈ బ్యాంకు శాఖల్లో దాదాపు 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏబిఎన్ ఆమ్రోకు 31 శాఖలున్నాయి. క్రెడిట్ కార్డు, బిపిఓ రంగాల్లో కూడా ఆమ్రో పనిచేస్తోంది. ఆమ్రో పేరు మార్చేందుకు ఆర్ బిఐ అనుమతి కోసం ఆర్ బిఎస్ ఎదురుచూస్తోంది.
News Posted: 27 February, 2009
|