3నెలల్లో సత్యం దర్యాప్తు
హైదరాబాద్: భారత కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన సత్యం కుంభకోణంపై దర్యాప్తును సిబిఐ మూడు నెలల్లో పూర్తి చేయనుందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా ఆదివారంనాడు స్పష్టం చేశారు. సత్యం కుంభ కోళ బాధ్యులనెవ్వరినీ వదిలేది లేదని ఆయన తేల్చి చెప్పురు. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ సంస్థ భవనానికి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. స్టాటస్టిక్ ఇన్వెస్టర్ ద్వారా సత్యం కంపెనీ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా టెండర్లను పిలిపించి, అత్యంత పారదర్శకంగా ఇన్వెస్టర్లను ఎంపిక చేయనున్నామని గుప్త తెలిపారు. కుంభకోణం దర్యాప్తుపై ప్రభత్వానికి ఎలాంటి వొత్తిడులు రావడంలేదని ఆయన తెలిపారు. సత్యం కుంభకోణం విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని అంతర్జాతీయ కార్పొరేట్ సమాజం హర్షించిందని గుప్త తెలిపారు.
News Posted: 1 March, 2009
|