మెగా రిఫైనర్ గా రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ జోడు సంస్థల విలీనం తర్వాత ప్రపంచంలో 13వ అతి పెద్ద ఆయిల్ రిపైనరీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. అమెరికా విద్యుత్ దిగ్గజం చెవ్రాన్ కార్పొరేషన్ స్థానం ఆర్ఐఎల్ కి దక్కింది. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ సంస్థలోని ప్రతి 16 షేర్లకు ఒక ఆర్ఐఎల్ షేర్ ను కేటాయిస్తున్నారు. జామ్ నగర్ లోని 33 మిలియన్ టన్నుల ఎగుమతి ఆధారిత రిఫైనరీకి ప్రక్కనే ఉన్న 29 మిలియన్ టన్నుల ఆర్పిఎల్ సెజ్ రిఫైనరీ ఏకమై మెగా రిలయన్స్ రిఫైనరీ అవతరించింది. దాంతో ప్రపంచంలోని అతి పెద్ద రిఫైనరీల్లో 13 స్థానాన్ని సాధించింది. అదే సమయంలో 50.7 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి)ను కూడా రిలయన్స్ రిఫైనరీ అధిగమించింది. ప్రపంచంలోని అతి పెద్ద రిపైనరీల జాబితాలో ఐఓసి సంస్థ 18వ స్థానంలో నిలిచింది.
రోజుకు 1.24 మిలియన్ బ్యారెల్స్ గుజరాత్ జామ్ నగర్ రిఫైనరీల్లో జరగుతోంది. దాంతో జామ్ నగర్ ప్రపంచంలో అతిపెద్ద రిఫైనింగ్ కూడలిగా అవతరించింది. చెవ్రాన్ రిఫైనింగ్ కెపాసిటీ 61 మిలియన్ టన్నులు. రిపైనింగ్ కంపెనీల ప్రపంచ జాబితాలో 268 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఎక్సాన్ మోబిల్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో 210 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో చైనా సినోపెక్ సంస్థ, తర్వాత పెట్రో చైనా 130 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో 7వ స్థానాన్ని ఆక్రమించింది. ఆర్పిఎల్ లోని చెవ్రాన్ షేర్లను షేరు 60 రూపాయలకు ఆర్ఐఎల్ కొనుగోలు చేసింది. దక్షిణాసియాలో తన రిపైనింగ్ బేస్ ఏర్పటు ప్రయత్నంలో భాగంగా 2006 ఏప్రిల్ లో ఆర్పిఎల్ లో చెవ్రాన్ మదుపు పెట్టింది.
News Posted: 2 March, 2009
|