'ఎకో బారన్'గా ముఖేష్
లండన్: పర్యావరణ పరిరక్షణ సాంకేతిక పరికజ్ఞానం, వ్యాపారంలో మదుపు చేస్తున్న ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత శతకోటీశ్వరుడు ముఖేష్ అంబానీ అయిదవ స్థానంలో నిలిచారు. సంపన్న పర్యావరణ దిగ్గజాల్లో ముఖేష్ తో పాటు మరో ముగ్గురు భారతీయులకు కూడా స్థానాలు లభించాయి. ఈ 'గ్రీన్ రిచ్ లిస్ట్'ను ది సండే టైమ్స్ రూపొందించింది. ఈ జాబితా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిగణనలోకి తీసుకున్న 100 మంది సంపన్నులతో రూపొందించారు. ఈ జాబితాలో నలుగురు భారతీయులు, ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి స్థానం దొరికింది.
అంబానీతోపాటు సుజ్లాన్ ఎనర్జీ తులసి తంతికి 49వ స్థానం, జేపి గ్రూప్ వ్యవస్థాపకుడు జయప్రకాష్ గౌర్ కు 50వ స్థానం, ఇంజనీరింగ్ సంస్థ థర్మాక్స్ మాజీ ఎగ్జిక్యూటవ్ అను అగాకు 78వ స్థానం దక్కాయి. భారతీయ సంతతికి చెందిన వెంచర్ కేపిటలిస్టు వినోద్ ఖోస్లాకు 52 స్థానం దక్కాయి. ఈ జాబితాలో కూడా వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. బఫెట్ 'వెల్త్ గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్' విలువ దాదాపు 27 బిలియన్ పౌండ్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత సాప్ట్ వేర్ జార్ బిల్ గేట్స్, స్వీడన్ కు చెందిన ఇంగార్ కంపార్డ్ లు రెండవ, మూడవ స్థానాల్లో నిలిచారు. 200 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఆస్తిపరులను ఈ గ్రీన్ లిస్ట్ కోసం ఎంపిక చేశారు. గ్రీన్ లిస్ట్ లోని 100 మంది టోకుగా 267 బిలియన్ డాలర్ల గ్రీన్ ఇన్వెస్టమెంట్ ఉన్నట్లు ఆ జాబితాలో అంచనా వేసారు. బిల్ గేట్స్ 26 బిలియన్ పౌండ్లు, కంపార్డ్ 22 బిలియన్ పౌండ్ల ఇన్వెస్ట్ మెంట్ పెట్టారు.
News Posted: 2 March, 2009
|