అక్టోబర్ లో బీటిల్ విడుదల
జెనీవా: అసలైన ప్రజా కారు 'బీటిల్' భారత రోడ్లపై అక్టోబర్ పరుగులు తీస్తుందని వోక్స్ వాగన్ కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాది పోలో కారును భారత్ లో విడుదల చేసే అవకాశముంది. దాంతోపాటు పుణె ప్లాంట్అభివృద్ధికి గాను వోక్స్ వాన్ కంపెనీ 3,600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.
'అక్టోబర్ నెల చివరినాటికి మేము బీటిల్ కారును భారతీయ మార్కెట్ లోకి విడుదల చేయనున్నాము.భారత్ లో 3,600 కోట్ల రూపాయలను మదుపు చేయాలన్న మా ప్రతిపాదనలో ఎలాంటి మార్పులేదు. మా పుణె ప్లాంట్ లో వచ్చే ఏడాది జనవరిలోగా పోలో కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తాము. మార్చ్ నాటికి పోలో కార్లను భారతీయ మార్కెట్లలోకి విడుదల చేస్తాము' అని వోక్స్ వాగన్ ఇండియా ప్రాజెక్ట్ అధిపతి లుడ్విగ్ గీర్కెన్ తెలిపారు. పోలో ధరపై గీర్కెన్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. పోలో కార్లను స్థానికంగా తయారు చేస్తాము. అదే విధంగా పూర్తి స్థాయి నిర్మాణ యూనిట్ల (సిబియు) ద్వారా బీటిల్ కార్లను ఉత్పత్తి చేస్తాము. పుణెలో వోక్స్ వాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఉంది. అదే విధంగా పుణెలో స్కోడా కార్ల తయారీ యూనిట్ ఉంది.
News Posted: 3 March, 2009
|