ఔట్ సోర్సింగ్ కు ఢోకా లేదు
ముంబై: ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా కంపెనీలు ఐటి ఆఫ్ షోరింగ్ (ఔట్ సోర్సింగ్) వైపు మరింతగా మొగ్గు చూపుతున్నాయి. అయితే అమెరికా కంపెనీల కాంట్రాక్టులను కొద్ది పాటి భారతీయ కంపెనీలు మాత్రమే అందుకోగల్గుతున్నాయని గార్టనర్ ఇండియా రీసెర్చ అధిపతి పార్థా అయ్యంగార్ సోమవారంనాడు తెలిపారు. మారిన మార్కెట్ పరిస్థితుల రీత్యా భారత ఐటి కంపెనీలు తన మార్కెటింగ్ విధానాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఖర్చులు తగ్గించు కోవడం, మరింత మెరుగైన ఖాతాదారుల సేవలను అందంచడం భారత ఐటి సంస్థలు నేర్చుకోవలసి ఉంటుంది. గార్టనర్ ఇండియా సంస్థ రీజియనల్ రీసెర్చ డైరెక్టర్ గా, వైస్ ప్రెసిడెంట్ గా పార్థ అయ్యంగార్ పనిచేస్తున్నారు.
దేశంలోని ఐటి కంపెనీల్లో రెండు కంపెనీవు మాత్రమే మారిన పరిస్థితుల కనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకున్నాయి. సేల్స్ ఫోర్స్ పెంచుకున్నట్లు ఆ రెండు కంపెనీలు మాత్రమే ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నట్లు అయ్యంగార్ తెలిపారు. భారత దేశం చొరవ చేయకపోతే గ్లోబల్ ఆఫ్ షోర్ దిగ్గజాలు ఐబిఎమ్, అక్సెంచర్, మరి ఇతర యూరోపియన్ సంస్థల కాంట్రాక్టులను జార విడుచుకుంటుంది. భారత దేశ ఐటి కంపెనీల ఆదాయాల్లో సగానికి పైగా అమెరికన్ ఔట్ సోర్సింగ్ కంపెనీల ద్వారా వస్తోంది. గ్లోబల ఫైనాన్షియల్ సంక్షోభంతో భారతీయ కంపెనీల ఆదాయాలకు పెద్ద గండి పడింది. కంపెనీలు ఆర్ధిక సంక్షోభం తొలి దెబ్బ నుండి మెల్లగా కోలుకుంటున్నాయని ఆయన తెలిపారు.
ఆఫ్ షోరింగ్ కోసం ఎదురు చూసే కంపెనీల ఫోన్ లు సంక్షోభ ప్రారంభంలో 20 శాతంగా ఉండేది, ప్రస్తుతం 30 శాతానికి పెరిగాయి. ఫిబ్రవరి నాసోకామ్ నివేదికలో 2008-09లో 21-24 శాతంగా ఉన్న తొలి అభివృద్ది అంచనాలకు భిన్నంగా 16-17 శాతం గా అంచనా వేసింది. అయితే నాసోకామ్ అంచనా చాలా సాంప్రదాయకంగా ఉంది. అందుకు భిన్నంగా అభివృద్ధి మరింత వేగంగా ఉంటుందని అయ్యంగార్ తెలిపారు. బరకా ఒకామా టాక్స్ మినహాయింపును రద్దు చేసినప్పటికీ అమెరికా ఆఫ్ షోర్ వ్యాపారం ఆగదు.
News Posted: 3 March, 2009
|