డాలరు 52 రూపాయలు
న్యూఢిల్లీ: ఆర్ధిక మాంద్య భయాలు ప్రపంచ మార్కెట్లలో సుడులు తిరగడంతో విదేశీ మదుపులు భారీగా తరలిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ప్రభావం విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై పడింది. దాంతో డాలరుతో రూపాయి మారకం మరింత ఘోరంగా తయారైంది. డాలరుకు 52-09 రూపాయల స్థాయికి రూపాయి విలువ దిగజారింది. అమెరికా ట్రజరీ బాండ్స్ సురక్షితమని అమెరికన్ ఇన్వెస్టర్లు భావించడంతో భారత స్టాక్ మార్కెట్ మదుపులు యుఎస్ కు తరలిపోయాయి. పర్యవసానంగా స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి పతనం జరిగిందని నిపుణుల అంచనా.
News Posted: 3 March, 2009
|