మూడేళ్ల స్థాయికి సెన్సెక్స్
న్యూఢిల్లీ: మూడేళ్ల అత్యల్ప స్థాయికి సెన్సెక్స పడిపోయింది. గురువారంనాడు జరిగిన ట్రేడింగ్ లో షేర్ల అమ్మకాలు విపరీతంగా, విచక్షణారహితంగా జరిగాయి. ద్రవ్యోల్బణం ఏడేళ్ల స్థాయి 3.03 శాతానికి చేరుకున్నప్పటికీ, ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ స్టాక్ మార్కెట్ పతనాన్ని నివారించలేక పోయాయి. యూరోపియన్ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. దాని ప్రభావంతో బిఎస్ఈ సెన్సెక్స్ 3 శాతం కుప్పకూలింది. 2005 నవంబర్ నాటి అత్యల్ప స్థితికి సెన్సెక్స్ చేరుకుంది.
ఆర్బిఐ రెపో రోట్లను తగ్గించినప్పటికీ, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైనప్పటికీ భారత స్ఠాక్ మార్కెట్లు కోలుకోలేక పోయాయి. ప్రపంచ ఆర్దిక మాంద్యం భయాలు సుడులు తిరుగుతుండడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ లో షేర్లను అమ్మి వేశారు. దాంతో స్టాక్ మార్కెట్లు మరింతగా దిగజారాయి. 30 షేర్ బిఎస్ఈ సెన్సెక్స్ 249.57 పాయింట్లు పతనమై 8,197.92 పాయింట్ల వద్ద నిలిచింది. అదే విధంగా 50 షేర్ ఎన్ ఎస్ఈ నిప్టీ ఇండెక్స్ 68.50 పాయింట్లు పతనమై 2,576.70 పాయింట్ల వద్ద నిలిచింది.
News Posted: 5 March, 2009
|