దివాలా అంచున 'జిఎమ్'
డెట్రాయిట్ : జనరల్ మోటార్స్ కార్పొరేషన్ (జిఎమ్) దివాలా అంచుకు చేరుకుందన్న అనుమానాలు ఆ సంస్థ ఆడిటర్లు గురువారంనాడు వ్యక్తం చేశారు. ఆ సంస్థ తన నష్టాలను పూడ్చుకోవడంలోనూ, డబ్బును విపరీతంగా ఖర్చుచేయడాన్ని నియంత్రించలేని స్థితికి చేరుకుంటోందని వారు తెలిపారు. జనరల్ మోటార్స ఆటోమొబైల్ సంస్థ పరిస్థితి కొంతకాలంగా ఊహిస్తున్నదే. కోర్టు ఆధీనంలోని దివాళా కార్యక్రమానికి వెలుపల తన బకాయిల వివాదాలను పరిష్కరించు కునేందుకు 30 బిలియన్ డాలర్ల వాటాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని జిఎమ్ కోరింది. జిఎమ్ షేర్లు 15 శాతం క్షీణించి ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో 1.87 డాలర్లకు చేరింది.
జిఎమ్ కంపెనీ రుణ దాతలు 6 బిలియన్ డాలర్లకు మించిన మొత్తాన్ని రుణాలుగా చెల్లించేందుకు రుణ మాఫీని అంగీకరించారు. ఇందువల్ల ప్రభుత్వాన్ని బెయిల్ ఔట్ నిధుల కోసం వొత్తిడి చేసేందుకు జిమ్ కు అవకాశముంటుంది. 2008లో 31 బిలియన్ డాలర్ల నష్టపడిన సందర్భంలో, తన మనుగడ విషయమై డెలోట్టి అండ్ టచే ఆడిటర్లను జిఎమ్ ప్రశ్నించింది. అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్స్ కు జిఎమ్ సంస్థ ఆలస్యంగా తన వార్షిక నివేదికను సమర్పించింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త కార్ల డిమాండ్ తగ్గడం, రుణ భారం లాంటి సమస్యల కారణంగా వార్షిక నివేదిక ఆలస్యమైనట్లు ఆ నివేదికలో జిఎమ్ తెలిపింది.
జిమ్ సంస్థ వద్ద జూన్ 1 నాటికి పక్వానికి వచ్చే ఒక బిలియన్ డాలర్ల కన్ వర్టిబుల్ డిబెంచర్లున్నాయి. రుణాల పునర్ణిర్మాణంలో ఒక్క రుణ దాత రాకపోయినా, చెల్లింపుల గడువు మీద పడటంతో జిఎమ్ దివాలా తీస్తుందని ఆ సంస్థ తెలిపింది. దివాలా పిటిషన్ ను కోర్టులో దాఖలు చేసినట్లయితే సంస్థ విచ్చిన్నమై పోతుంది. కంపెనీని పునరుద్దరించేందుకు ఫైనాన్స్ సంస్థలు ముందుకు రావు. అదే సమయంలో ఒక దివాలా తీసిన కంపెనీ కార్లను కొనేందుకు వినియోగదారులు విముఖత చూపిస్తారు. యునైటెడ్ ఆటో వర్కర్స్, బాండ్ హోల్డర్స్ తో జరిపే రాయితీ చర్చలను మార్చి చివరినాటికి జిఎమ్ పూర్చి చేయాలనే గడువుంది. ఈ లోపు యుఎస్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా ఎర్పాటు చేసిన ఆటో టాస్క్ ఫోర్స్ ను ఒప్పించి నిధులను సేకరించగల్గితే జిఎమ్ కార్పొరేషన్ ఒడ్డున పడగలదు.
News Posted: 6 March, 2009
|