ఐసిఐసిఐ రేట్ల తగ్గింపు
ముంబై: గృహ రుణాల వడ్డీరేట్లపై 25-50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు శుక్రవారంనాడు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది. తగ్గింపు కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఆ బ్యాంక్ అధికార ప్రతినిధి తెలిపారు. 20 లక్షల రూపాయల లోపు గృహ రుణాలపై 10 శాతంగా ఉన్న వడ్డీ రేటును 9.75 శాతానికి, 20-30 లక్షల రూపాయల గృహ రుణాలపై 10.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 10 శాతానికి, 30 లక్షల రూపాయలకు పైబడ్డ గృహ రుణాల పై 12 శాతం వడ్డీ రేటును 11.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది.
News Posted: 6 March, 2009
|