కాల్ చేసి నోరు జారొద్దు!
ముంబై: ఐసిఐసిఐ బ్యాంకు వినియోగదారులు ఇక మీదట మాట జర భద్రంగా వాడాలి. బ్యాంకు కాల్ సెంటర్ ఉద్యోగితో ఇష్టమొచ్చినట్లు కోపంగా లేదా తిడుతూ మాట్లాడితే పడి ఉండే రోజులు పోయాయి. తమ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ లతో అసభ్యంగాను లేదా తిడుతూ మాట్లాడిన కస్టమర్లకు తమ సేవలను నిలిపివేయాలని ఐసిఐసిఐ బ్యాంకు నిర్ణయించుకుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశంలోనే తొలిసారిగా ఐసిఐసిఐ బ్యాంకు తీసుకున్నట్లవుతుంది. అయితే పార్లమెంటేతర భాష లేదా దూకుడుగా మాట్లాడటంపై బ్యాంకు స్పష్టంగా వివరించలేదు. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లు వినియోగదార్ల పై ఇంతవరకు చేసిన ఫిర్యాదులను బ్యాంకు త్వరలో పరిశీలించనుంది. అందులో నుండి అత్యంత దూకుడుగా మాట్లాడే వినియోగదార్లను బ్యాంకు గుర్తించనుంది.
అయితే ఐసిఐసిఐ బ్యాంకు ఇలాంటి చర్య తీసుకునేందుకు పురికొల్పిన విషయం ఇంకా తెలియరాలేదు. ఐసిఐసిఐ బ్యాంకు తోపాటు వినియోగదార్ల సేవలందించే కంపెనీలకు సంబంధించిన వినియోగదారుల్లో దాదాపు 1 లేదా 2 శాతం మంది ఇలాంటి తప్పుడు భాషను వినియోగించడం పరిపాటి. హాస్పిటాలిటీ, ఎయిర్ లైన్, బ్యాంకింగ్ రంగాల అంతర్జాతీయ సంస్థలు కూడా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే బిజినెస్ స్టాండర్డ్ గురించి ప్రస్తావించే పలు వెబ్ సైట్లు ఇప్పటి వరకు ఎలాంటి నియమావళి గురించి ప్రస్తావించనే లేదు. అయితే అలాంటి నిబంధన ఏదీ రాతపూర్వకంగా ఎక్కడా ఉండదు. అయితే ఎయిర్ లైన్స్, హోటల్ సంస్థలు తాగుబోతు వినియోగదార్లతో వ్యవహరించేందుకు నిరాకరిస్తున్నాయి. భారత దేశంలోని పలు కంపెనీలు, బ్యాంకులు, టెలికామ్ సంస్థలు దూకుడగా, తప్పుడుగా మాట్లాడే వినియోగదార్లతో వ్యవహరించేందుకు భిన్న పద్ధతులను రూపొందించుకున్నాయి. అయితే ఏ సంస్థ కూడా వినియోగదారునితో సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంటానని ప్రకటించలేదు. ఐసిఐసిఐ బ్యాంకు ఒక్కటే అలాంటి పోకిరి వినియోగదారునితో సంబందాన్ని తెంచుకుంటానని ప్రకటించడం విశేషం.
News Posted: 9 March, 2009
|