యుఎస్ సంస్థలకు ఎమ్ఎన్ పి
న్యూఢిల్లీ: భారత దేశ మొబైల్ నెంబరు పోర్టబిలిటీ (ఎమ్ఎన్ పి) వ్యవస్థ నిర్వహణ రెండు అమెరికా సంస్థలకు అప్పగించినట్లు ప్రభుత్వ ప్రతినిధి సోమవారంనాడు ప్రకటించారు. అందుకుగాను, సిన్వర్స్ టెక్నాలజీస్, టెల్కార్డియా టెక్నాలజీస్ అన్న రెండు అమెరికా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది.ఈ ఏడాది చివరినాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వైర్ లెస్ మార్కెట్ లో మొబైల్ నెంబరు పోర్టుబిలిటీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మొబైల్ నెట్ వర్క్ మారిన సందర్భంలో మొబైల్ నెంబరు కూడా మారడం. సహజం. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా కొంత ఫీజును చెల్లించి అదే నెంబరును మరే నెట్ వర్క్ లోకి మారినప్పటికీ కొనసాగే పోర్టబిలిటీ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దేశంలోని ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలను ఆవరించిన నెట్ వర్క్ లను అనుసంధానిస్తూ ఒక క్లియరింగ్ హౌస్ ను సిన్వర్స్ సంస్థ నిర్వహిస్తుంది. దక్షిణ, తూర్పు రాష్ట్రాలను ఆవరించిన నెట్ వర్క్ లను అనుసంధానిస్తూ టెలికామ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టెలికార్డియా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక క్లియరింగ్ హౌస్ నడుస్తుంది. ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయినట్లు సిన్వర్స్ ప్రకటించింది.
News Posted: 9 March, 2009
|