ద్రవ్యోల్బణం జీరో
ముంబై: ఈ ఏడాది మార్చి చివరినాటికి ద్రవ్యోల్బణం సున్న స్థాయికి చేరనుందని యాక్సిస్ బ్యాంక్ ఒక నోట్ లో పేర్కొంది. దాంతో గేట్ డ్యూటీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు లాంటివి తగ్గిపోతాయని ఆ బ్యాంక్ తెలిపింది. గత ఏడాది ఆగష్టులో 13 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం క్రమంగా క్షీణించి గత వారాంతంలో 3.03 శాతానికి దిగిపోయింది.
వినియోగదారుల డిమాండ్ అనూహ్యంగా క్షీణించించింది. ఏప్రిల్ లో టోకు ధరల సూచిక ఆధారంగా నడిచే ద్రవ్యోల్బణం రుణాత్మాక స్థాయికి చేరుకుంటుందని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. వారం క్రితం కీలక వడ్డీ రేట్లపై ఆర్ బిఐ 50 బేసిక్ పాయింట్లు తగ్గించింది. అయితే కుటుంబాల ఖర్చులను తెలియజేసే వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కగట్టే ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగానే ఉంది. అయితే ప్రభుత్వ ఇంధన ధరలు తగ్గింపు, సర్వీసు టాక్స్ ల మినహాయింపుల కారణంగా వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోంది. 2009 జనవరిలో టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉన్నప్పుడు వినియోగదారుల ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 10.5 శాతంగా ఉండేది.
News Posted: 9 March, 2009
|