'మైనస్'లో ఆర్ధిక వ్యవస్థ
డర్ ఎస్ సలామ్: ప్రపంచ ఆర్ధికాభివృద్ధి 2009లో సున్నా కంటే దిగువకు మైనస్ లో ఉండబోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) మంగళవారంనాడు ప్రకటించింది. 'ప్రపంచ దవ్య సంస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేయడంతోపాటు, వినియోగదారుల, వ్యాపారుల విశ్వాసం కుప్పకూలింది. దాంతో స్థానిక డిమాండ్ కుదేలయ్యింది.' అని ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్-కాన్ టాంజానియాలోని ఆఫ్రికా నాయకులకు తెలిపారు. ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం ప్రారంభించాలని అమెరికా ప్రపంచ దేశాలకు పిలుపిచ్చింది. అయితే అమెరికా పలుపును యూరప్ ఖాతరు చేయలేదు. దాంతో అభివృద్ధి చెందిన దేశాలకు, పేద దేశాలకు మధ్య మరింత గండి పెరిగిపోయింది.
ఏప్రిల్ 2న జరుగబోయే అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఏర్పాట్ల కోసం నిర్వహిస్తున్న20 దేశాల ఆర్ధిక మంత్రుల సన్నాహక సమావేశం ఈ వారాంతంలో జరుగనుంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు పలు దేశాలతో కూడిన ఐక్య సంఘటన ఏర్పడే అవకాశముంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అడ్వైజర్ లారెన్స్ సమ్మర్స్ ప్రపంచ దేశాల ప్రభుత్వాలను ఆయా దేశాల మార్కెట్లలోకి మరింత డబ్బును విడదల చేసి డమాండ్ ను సృష్టించాల్సిందిగా కోరారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ను సృష్టించడం ప్రాథమిక షరతుగా అమెరికా భావిస్తోంది. అయితే అందుకు యూరోపియన్ యూనియన్ వ్యతిరేకిస్తోంది. యురో జోన్ ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో సమ్మర్స్ కోరిన డిమాండ్ ను సృష్టించే ఆర్ధిక చర్యల్ని చైర్మన్ జీన్ క్లాడె జంకర్ తిరస్కరించారు.
News Posted: 10 March, 2009
|