టిసిఎస్ లో మళ్ళీ జాబ్స్ కోత
న్యూఢిల్లీ: ఉద్యోగాలు కోల్పోయే విషాద గాథ ఎపిసోడ్స్ రూపంలో సాగుతోంది. రాబోయే కొద్ది మాసాల్లో దేశంలోని అతి పెద్ద ఐటి సర్వీసెస్ సంస్థ 1,300 ఉద్యోగులను తొలగించనుంది. ఈ సంఖ్య కంపెనీకి చెందిన మొత్తం 1,30,000 మందికి పై చిలుకు ఉద్యోగుల్లో ఒక శాతం కంటే తక్కువగా ఉంది. ఈ ఉద్యోగులకు తగిన శక్తి సామర్ధ్యాలు లేకపోవడంతో తొలగిస్తున్నామని టిసిఎస్ అధికార ప్రతినిధి తెలిపారు. పక్షం రోజుల క్రితం చెన్నై టిసిఎస్ డెవలప్ మెంట్ సెంటర్లలో దాదాపు 200 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
కంపెనీ సిఈఓ రామదొరై ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అస్థిరమైన జీతాల చెల్లింపు అంశాన్ని, పనిగంటల పెంపు విషయాన్ని కంపెనీ పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. తక్షణమే ఉద్యోగులను తొలగించే ప్రశ్నే లేదని, పరిస్థితి మరింత దిగజారితే జాబ్స్ కోత తప్పనిసరి అవతుందని ఆయన తెలిపారు. టిసిఎస్ సంస్థ మొత్తం ఖర్చులో ఉద్యోగుల ఖర్చు 53-54 శాతంగా ఉందని రామదొరై తెలిపారు.
News Posted: 10 March, 2009
|