ప్రభుత్వ బ్యాంకులతో టాటా
న్యూఢిల్లీ: భారత గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం నానోలను మార్కెటింగ్ చేసేందుకు టాటామోటార్స్ వ్యూహాన్ని రూపొందించింది. అందువల్ల దేశ గ్రామీణ ప్రాంతాల్లో సైతం బలమైన యంత్రాంగాన్ని కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులతో టాటా మోటార్స్ ఒప్పందాలు కుదర్చుకుంది. దేశంలోని టైర్-1, టైర్-2 పట్టణాల్లోకి చొచ్చుకుపోయేందుకు టాటా మోటార్స్ వ్యూహం ఖరారు చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆప్ పాటియాలాలతో టాటా మోటార్స్ ఒప్పందాల్ని కుదుర్చుకుంది.
ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసే నానో కార్లను గణనీయమైన సంఖ్యలో మెట్రోయేతర నగరాల్లో అమ్మాలని టాటా మోటార్స్ సంస్థ ఆశిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖల్లో మాత్రమే ఫైనాన్స్ రుణాలను అందివ్వడంగా కాక, దేశ వ్యాప్తంగా విస్తరించిన టాటా మోటార్స్ 329 బ్రాంచ్ లలో కూడా ఈ ప్రభుత్వ బ్యాంకులు తమ సేవల్ని అందించనున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ఎనిమిది నెలలుగా ఆటో ఫైనాన్సింగ్ రంగం నుండి విరమించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆటో పైనాన్సింగ్ రంగంలోకి ప్రవేసించిన విషయం తెలిసిందే.
దాదాపు 18 నెలల కాలంలో మారుతి కార్లకు ఇస్తున్న పైనాన్సింగ్ లో ప్రైవేట్ రంగ బ్యాంకుల పాత్ర 70 శాతం నుండి 30 శాతానికి పడిపోయింది. టాటా మోటార్స 2009 మూడవ త్రైమాసికంలో తన సొంత ఫైనాన్సింగ్ 33.8 శాతం ఉంటే, మిగిలిన 66 శాతం ఫైనాన్స్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పంచుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో టాటా మోటార్స్ ఈ మధ్యకాలంలో ఏర్పరచుకున్న ఒప్పందాలు ఈ పరిస్థితితి మారిపోగలదు.
News Posted: 10 March, 2009
|