నానో లోన్ చాలా ఖరీదే!
ముంబై: నానో ఫైనాన్స్ పథకంపై టాటా మోటార్స్ కసరత్తు చివరాఖరకు వచ్చింది. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) నానో రుణంలో 70 శాతాన్ని భరించనుంది. ఈ వాహన రుణంపై దాదాపు 14-14.75 శాతం వడ్డీ రేటును ఎస్ బిఐ వసూలు చేస్తుంది.నానో రుణం అయిదేళ్ళలో సులభ వాయిదాల్లో చెల్లించవలసి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎస్ బిఐ జనరల్ మేనేజర్లు, టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ లు వారం క్రితం ఫైనాన్స్ పథకాన్ని రూపొందించేందుకు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశ మారుమూల గ్రామీమ ప్రాంతాల్లో సైతం నానో మార్కెటింగ్ కోసం అనుసరించ వలసిన విధి విధానాలపై చర్చించడం జరిగింది.
అయితే నానో ఫైనాన్సింగ్ కోసం రూపొందించిన నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందచేసే సాధారణ వాహన రుణాల కంటే చాలా కఠినంగా ఉన్నాయి. టాటా మోటార్స్ నానో వెబ్ సైట్ లో దాదాపు 4 కోట్ల కొర్రీలు వచ్చాయని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నానో ప్రారంభ ధర టాక్స్ లు మినహోయిస్తే ఒక లక్ష రూపాయలుగా ఉంటుందని, ఎయిర్ కండిషన్ మోడల్ కోసం 25-30 వేల రూపాయలను వినియోగదారులు అదనంగా చెల్లించవలసి ఉండొచ్చని పలు అంచనాలు నడుస్తున్నాయి. అయితే ధర విషయంపై డీలర్లకు ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదని తెలుస్తోంది.
'బుకింగ్ ప్రక్రియ వివరాలను 2009 మార్చ్ 23 ప్రకటనలో విడుదల చేయనున్నారు. దేశం వ్యాప్తంగా నానో కార్లు లభ్యమయ్యేందుతుకు వీలుగా పలు సౌకర్యాలను టాటా మోటార్స్ సంస్థ రూపొందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు వారి వారి స్వస్థలాల నుండే నానో బుకింగ్ చేసుకనేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నాము.' అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు. గుజరాత్ లో అక్టోబర్ నుండి ప్రారంభం కానున్న నానో కార్ల ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా పుణె, పంత నగర్ టాటా మోటార్స్ ప్లాంట్లలో నానోలను తాత్కాలికంగా రూపొందిస్తున్నారు.తొలి 12 నెలల్లో దాదాపు ఒక లక్ష నానో కార్లను తయారు చేస్తున్నారు. కార్ల కేటాయింపులో చేపట్టిన వినూత్న పద్ధతి వల్ల నానో కార్లను బ్లాక మార్కెట్ లో విక్రయించడం తగ్గిపోతుంది. కంప్యూటర్ ఆధారంగా నానో కొనుగోలు దార్లను ఎంపిక చేయనున్నారు. కొనుగోలుదారు పేరు మీద నానో కార్లన డీలర్లకు విడుదల చేయనున్నారు.
News Posted: 17 March, 2009
|