భద్రత మధ్య నానో రిలీజ్
ముంబై: కొత్త మోడల్ కారు విడుదలపుడు పెద్ద ఎత్తున బందోస్తు ఏర్పాటు దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా నానో మాతృక విడుదల విషయంలోనే జరిగింది. ఉద్విగ్నతతో ఎదురుచూస్తున్న జనాలను నియంత్రించేందుకు పోలీసులు ఆనాడు ముందు జాగ్రత్తగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే పరిస్థితి తిరిగి నానో బుకింగుల సమయంలో జరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత భద్రతా ఏర్పాట్లను నానో బుకింగ్ విషయంలో కూడా చేపట్టారు. ఈ ఏర్పాట్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భద్రతా దళాలను వినియోగిస్తున్నారు.
మార్చ్ 23న నానో కారును ముంబై మెరైన్ డ్రైవ్ లోని పార్శీ జింఖానా వద్ద సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. దేశ చరిత్రలోనే ఒక కారు విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి. ఆహ్వానితులు మాత్రమే టాటా విడుదల కార్యక్రమంలో హాజరవుతారు. అయితే చాలా కాలంగా ప్రజల్లో నెలకొన్న ఉద్విగ్నత కారణంగా తోపులాటలు జరగవ్చని కంపెనీ వర్గాలు ఊహిస్తున్నాయి.
News Posted: 18 March, 2009
|