సెంకడ్స్ పై నానో దెబ్బ
ముంబై: నానో కార్లు ఆటోమొబైల్ మార్కెట్ లో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. నానో కార్ల బుకింగుల కారణంగా వాడిన కార్ల మార్కెట్ డిమాండ్ 25-30 శాతానికి పడిపోయింది. నానో కారు సోమవారంనాడు వాణిజ్యపరంగా విడుదల అవుతుంది. నానో విడుదల తర్వాత మారుతి 800, మారుతి ఆల్టో, హ్యూండాయ్ సాంత్రో లాంటి చిన్న కార్ల ద్వితీయ మార్కెట్ 15-20 శాతం క్షీణించవచ్చని ఆటోమొబైల్ డీలర్లు అంచనా వేస్తున్నారు. నానో డెలివరీ ప్రారంభంమై, రోడ్ల మీద తిరుగుతుంటే వాడిన కార్ల మార్కెట్ మరో 10 శాతం కూడా పడిపోగలవన్న అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
'నానో కారు విడుదల చేసినప్పటి నుండి వాడిన కార్ల మార్కెట్ లో ప్రతికూల ప్రభావం ఉంది. ప్రజలు కార్ల కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. నానో కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా మార్కెట్ లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది.' అని ముంబై లోని అతిపెద్ద కార్ల డీలర్ ఫజులభాయ్ మోటార్స్ డైరెక్టర్ ఆరిఫ్ ఫజుల్ భాయ్ తెలిపారు. నానో కారు ఆన్ రోడ్ ధర 1.25 నుండి 1.3 లక్షల రూపాయలుండొచ్చు. బ్యూండాయ్ మోటార్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ కంపెనీల చిన్న కార్లతో నానో కార్లు పోటీ పడనున్నాయి. ఎయిర్ కండిషనింగ్, సెంట్ల లాకింగ్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ సౌకర్యాలతో కూడిన నానో హైఎండ్ కారు దాదాపు 1.7 లక్షల రూపాయల ధర పలుకుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
చాలా మోడల్ కార్ల ధరలను దించేందుకు నానో కారు ఉపయోగపడింది. ఉదాహరణకు, 2006 హ్యూండాయ్ సాంత్రో కారు సాధారణ ధర 2,6000 రూపాయలుగా ఉండేది.అయితే ప్రస్తుతం దాని ధర 3,00,000 రూపాయలకు పడిపోయింది. అదే విధంగా 2,60,000 రూపాయలుగా ఉన్న మారుతి సుజుకి జెన్ ఎస్టిలో ధర ప్రస్తుతం 3 లక్షల రూపాయలకు పడిపోయింది. చిన్న కార్ల ధర స్థిరంగా తగ్గిపోవడంతో ప్రారంభ స్థాయిలోని మోడల్ కార్లు, మధ్యంతర స్థాయిలోని పలు కంపెనీల కార్ల ధరలు దాదాపు 10 శాతానికి క్షీణించాయి. వాడిన కార్లకు డిమాండ్ మరింతగా తగ్గుతున్న భయాలు మార్కెట్ లో వ్యాపించడంతో అమ్మకం దార్లు తమ కార్ల ధరలను తగ్గించి అమ్మకుంటున్నారు. వాడిన కార్ల ధరలు అసంఘటిత రంగ మార్కెట్ లో మాత్రమే తగ్గాయి. సంఘటిత రంగం మార్కెట్లలో వాడిన కార్ల ధరలు తగ్గడం జరగలేదు. భారత దేశ వాడిన కార్ల మార్కెట్ చాలా మటుకు అసంఘటితంగానే ఉంది. వాడిన కార్ల మార్కెట్లో సంఘటిత వ్యాపారులు అతి కొద్ద 20 శాతం మాత్రమే ఉన్నారు.
News Posted: 18 March, 2009
|