రైల్వేలో వైర్ లెస్ ఇంటర్నెట్
లండన్: రైల్వే మంత్రి లాలూ ఆధునికతకు పెద్ద పీఠ వేసినట్లు కనపడుతోంది. భారతీయ రైల్వేల్లో వైర్ లెస్ ఇంటర్నెట్ వ్యవస్థను అమర్చేందుకు బ్రిటన్ విఫి టెక్నాలజీ దిగ్గజం నోమాడ్ డిజిటల్ సంస్థకు, బారత కంపెనీ జైలాగ్ సిస్టెమ్స్ కు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. న్యూ కేసిల్ కేంద్రంగా పనిచేసే నోమాడ్ డిజిటల్ సంస్థ రవాణా రంగానికి వైర్ లెస్ వ్యవస్థలను సరఫరా చేస్తుంది. అదే సమయంలో బ్యాంకింగ్, ఇన్ ష్యూరెన్స్, టెలికామ్ లాంటి బహుముఖ రంగాలకు ఐటి ఉత్పత్తులను, ఐటి సొల్యూషన్స్ ను జైలాగ్ సంస్థ అందిస్తుంది.
ప్రతిష్టాత్మకమైన భారత రైల్వేలకు విఫి వ్యవస్థలను అందిస్తున్నాము. భారత రైల్వేలు ప్రపంచంలోన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా మేము భావిస్తున్నాము. భారత దేశంలో ఆన్ బోర్డ్ ఎంటర్ టైన్మెంట్ సర్వీసులు, విఓఐపి సర్వీసుల్లాంటి ఇతర రంగాలకు కూడా విస్తరించేందుకు మేము ప్రయత్నిస్తున్నామని నోమాడ్ చీప్ ఎగ్జిక్యూటివ్ గ్రైమే లోడన్ తెలిపారు. లండన్ గ్లాస్కో మార్గంలో 600 కిలోమీటర్ల పొడవున ప్రపంచంలోని అతి పొడవైన బ్రాడ్ బాండ్ కారిడార్ ను ఈ సంస్థ నిర్మించింది. అదే విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2005లో బ్రైటన్ ఎక్స్ ప్రెస్ లో రైల్ బ్రాండ్ బ్యాండ్ ను నిర్మించిన అనుభవం ఈ సంస్థకు ఉంది.
News Posted: 19 March, 2009
|