వాషింగ్టన్: ద్రవ్య సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్దిక వ్యవస్థ కుదించుక పోతోందని ఐఎమ్ఎఫ్ గురువారంనాడు తెలిపింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 60 ఏళ్లలో ఈ ఏడాది తొలిసారిగా ఒక్క శాతం దాకా కుదించుకు పోగలదని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. గత వారంలో 20 దేశాల ఆర్ధిక అధినేతలు సమావేశంలో రూపొందించిన నివేదికను గురువారంనాడు బ్రిటన్ లో విడుదల చేశారు. రెండు నెలలుగా ఐఎమ్ఎఫ్ ఎలాంటి అంచనాలను చేపట్టలేదు. జనవరి 28న వరల్డ్ ఎకానమిక్ ఔట్ లుక్ వేసిన అంచనా కంటే ఐఎమ్ ఎఫ్ అంచనాలు తక్కువగా ఉన్నాయి. అయితే 2010లో ప్రపంచ సంక్షోభం కొద్దిగా ఉపశమిస్తుందని ఆ నివేదిక పేర్కొంది. 1.5 శాతం నుండి 2.5 శాతం దాకా వృద్ధి రేటు నమోదు కాగలదని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. ప్రపంచం 2009లో 3.0 శాతం నుండి 3.5 శాతం వృద్ధి రేటు సాధించగలదని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది.