సెల్ నెట్ వర్క్ లకు రేటింగ్స్
న్యూఢిల్లీ: మొబైల్ నెట్ వర్క్ ను ఎంచుకోవడం సగటు వినియోగదారునికి రాను రాను కష్టమవుతోంది. ప్రతి నెట్ వర్క్ అత్యంత ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తన్నట్లే కనపడుతాయి. తీరా వాస్తవంలో టెలిఫోన్ బిల్లులు అందుకోగానే గూబ గూయ్యమంటుంది. అయితే ఇక మీదట ఆ కష్టాలుండవు. ప్రభుత్వ టెలకామ్ సంస్థ నెట్ వర్క్ సంస్థలన గ్రేడ్ లను కేటాయించే పద్దతిని త్వరలో తీసుకరానుంది. దాంతో వినియోగాదారునికి నెట్ వర్క్ ను ఎంచుకోవడంలో ఎదురయ్యే కష్టాలు తప్పనున్నాయి. ఆరు అంశాల ఆధారంగా టెలికామ్ కంపెనీలకు గ్రేడ్లను కేటాయించారు. మొబైల్ లేదా ల్యాండ్ ఫోన్ సర్వీసులకు ఈ గ్రేడ్ లు వర్తిస్తాయి.
టారిఫ్, కాల్ డ్రాప్స్, నెట్ వర్క్ రద్దీ, బిల్లింగ్ సమస్యలు, ప్రతిస్పందిచే సమయం, నెట్ వర్క్ విస్తృతి లాంటి ఆరు అంశాల ఆధారంగా ఆయా సర్కిల్ లోపల ట్రాయ్ గ్రేడ్లను రూపొందిస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) సైతం పబ్లిక్ ఇష్యూలకు ఇంతవరకు గ్రేడ్లను కేటాయింేేేలేదు. అయితే ఒక పబ్లికి ఇష్యూను విడదల చేయడానికి అవసరమైన నిబంధనలన మాత్రమే సెబీ రూపొందించింది. అదే విధంగా, టెలికామ్ కంపెనీల రేటింగ్ లపై నిబంధలను ట్రాయ్ జారీ చేయనుంది. టెలికామ్ కంపెనీలు రోజుకొక కొత్త టారిఫ్ ప్లాన్ ను విడుదల చేస్తున్నాయ్, కొన్నిటిని రద్దు చేస్తున్నాయి. దీంతో వినియోగదారుల్లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఈ రేటింగ్ విధానం వల్ల టెలికామ్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రొత్సాహకం లభించినట్లవుతుంది. ఈ రేటింగ్ విధానం వినియోగదార్లకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, నెట్ వర్క్ ల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి ప్రొత్సాహకంగా ఉంటుందని ట్రాయ్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
News Posted: 20 March, 2009
|