సెన్సెక్స్ 5% పెరుగుదల
ముంబై: అమెరికా, యారప్ ఆసియాలతో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ల పెరుగుదల నేపథ్యంలో సెన్సెక్స్ ఆశావహంగా 73 పాయింట్ల లాభంతో సోమవారంనాడు ప్రారంభమైంది. బ్యాంకింగ్, విద్యుత్, మెటల్ స్టాక్ ల కొనుగోళ్లు వేగవంతం కావడంతో సెన్సెక్స్ పైకెగసింది. సెన్సెక్స్ 5 శాతం అంటే 457 పాయింట్లు పెరిగి 9,424 పాయింట్ల వద్ద నిలిచింది. బిఎస్ఈ బ్యాంకెక్స్ 6.7 శాతం పెరిగి 4,326 పాయింట్ల వద్దకు చేరింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 6.4 శాతం పెరిగి 6,775 పాయింట్ల వద్ద, మెటల్ ఇండెక్స్ 6.3 శాతం పెరిగి 5,593 పాయింట్ల వద్ద నిలిచాయి. మార్కెట్ విస్తృతి చాలా అనుకూలంగా ఉంది. 2,642 స్టాకుల్లో 1,629 స్టాకులు లాభం పొందగా, 899 షేర్లు క్షీణించగా, మిగిలిన షేర్లు నిలకడగా ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఇండెక్స్ నిఫ్టీ 4.7 శాతం పెరిగి 2,939 పాయింట్ల వద్ద నిలిచింది.
News Posted: 23 March, 2009
|