సరికొత్త 'అసుస్' లాప్ టాప్
ముంబై: నెట్ బుక్ అభిమానులకు శుభవార్త. దాదాపు 10 గంటలపాటు పనిచేసే ఏఆర్ఎమ్ బ్యాటరీ ఆధారిత లాప్ టాప్ ల కోసం ఎంతో కాలం ఎదురు చూడవలసిన అవసరం లేదు. తైవాన్ కు చెందిన ఆసుస్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 9.5 గంటల సేపు పనిచేసే బ్యాటరీలతో కూడిన లాప్ టాప్ లను కొత్తగా రూపొందించింది. 'ఒక పూర్తి పని దినం' పనిచేసే బ్యాటరీలతో కూడిన లాప్ టాప్ లను సరికొత్తగా తయారు చేసింది. ఇందుకోసం 8700 ఎమ్ఏహెచ్ బ్యాటరీలను ఆ లాప్ టాప్ ల్లో వాడారు. సాధారణ లాప్ టాప్ ల్లో 220 ఎమ్ఏహెచ్ బ్యాటరీలను ఉపయోగిస్తారు.
భారత దేశంలో ఇప్పటివరకు సామ్ సంగ్-10 ఎన్ లాప్ టాప్ లు మాత్రమే 6.5 గంటలసేపు పనిచేసే బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉన్నాయి. ఈ బ్యాటరీల శక్తి 5,200 ఎమ్ఏహెచ్ గా ఉంటుంది. ఒక మేర తీవ్రతతో మాత్రమే ఈ లాప్ టాప్ లపై పనిచేస్తే బ్యాటరీ లైఫ్ గరిష్టంగా వస్తుంది. బ్యాటరీ సామర్ధ్యం పెరిగే కొద్దీ లాప్ టాప్ బరువు పెరుగుతుంది. హెచ్ పి మిని 1.25 కెజిలు, సామ్ సంగ్ ఎన్-10 1.25 కెజిలు బరువుంటే 1000 హెచ్ఈ లాప్ టాప్ బరువు 1.45 కెజిలుగా ఉంది. ఇంటెల్ కంపెనీకి చెందిన ఎన్ 280 ఆటమ్ ధర 26 వేల రూపాయలుగా ఉందని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఎన్ 270 ప్రాసెసర్ కంటే ఎన్ 280 ఆటమ్ లాప్ టాప్ కొంత ఆధునికమైనది. మొదటి దానికన్నా సమర్ధవంతంగా పనిచేస్తుంది. భారత్ లోని నెట్ బుక్స్ అన్నీ ఎన్-270 ప్రాసెసర్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవి. ఈ కొత్త లాప్ టాప్ లో 10 అంగుళాలచో 1024*600 మెగాపిక్సెల్, 160 జిబి హార్డ్ డిస్క్, విండోస్ ఎక్స్ పితో కూడిన ఎల్ఈడి బాక్ లిట్ డిస్ప్లే ఈ లాప్ టాప్ లో ఉంది. వాటితోపాటు, ఎన్ విఫి నెట్ వర్క్ ప్రోటోకాల్ సదుపాయం కూడా ఉంది.
News Posted: 24 March, 2009
|