కెజి గ్యాస్ తో 'లోటు'కు చెక్
న్యూఢిల్లీ: కృష్ణ-గోదావరి బేసిన్ గ్యాస్ భారత దేశ ఆర్ధిక భారాన్ని కొంత నివారించగలదని ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ గోల్డమాన్ సాక్స్ మంగళవారంనాటు తెలిపింది. కెజి గ్యాస్ బేసిన్ డి-6లో 2009 మార్చ్ మాసాంతం నుండి గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ గ్యాస్ ఉత్పత్తి భారత ద్రవ్య లోటును కొంత నివారించడమే కాక, దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితిని నిలువరిస్తుందని గాల్డ్ మాన్ సాక్స్ సంస్థ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
భారత స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతంగా భారత ద్రవ్య లోటు రెండితల కంటే అధికంగా పెరిగింది. బడ్జెట్ లక్ష్యం 2.5 శాతంగా ఉంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఈ లోటు 5.5 శాతానికి దిగిరావచ్చు. స్థూల ఆర్ధిక వ్యవస్థ నుండి వచ్చే లాభాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అయితే ఈ గ్యాస్ ఉత్పత్తి ద్వారా ఒనగూరే ప్రయోజనం గ్లోబల్ షాక్ లు, పెట్టుబడులు మందగించడం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో శుభ శకునంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. గ్యాస్ ఉత్పత్తితో విద్యుదుత్పాదన జరుగుతుంది. రాబోయే అయిదేళ్లలో గ్యాస్ సరఫరా, పంపిణీ రంగాల్లో దాదాపు 10 బిలియన్ల అమెరికన్ డాలర్లు (50 వేల కోట్లు రూపాయలు) పెట్టుబడి వస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి.
News Posted: 24 March, 2009
|