హెడిఎఫ్ సి వడ్డీరేటు తగ్గింపు
ముంబై: ప్రముఖ గృహ రుణాల సంస్థ హెచ్ డిఎఫ్ సి 0.5 శాతం వడ్డీరేటు తగ్గిస్తున్నట్లు మంగళవారంనాడు ప్రకటించింది.ఈ తగ్గింపు బుధవారం నుండి అమలులోకి వస్తుంది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ డిఎఫ్ సి) రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్ పిఎల్ఆర్)ను 14 శాతానికి తగ్గించింది. గత ఏడాది డిసెంబర్ నుండి ఆర్ పిఎల్ ఆర్ ను ఒక శాతం దాకా హెచ్ డిఎఫ్ సి తగ్గించింది.
'పోర్టుఫోలియో స్థాయిలో పలు ఖర్చులు తగ్గిపోవడంతో ఈ ప్రయోజనాన్ని మేము మా వినియోగదారులకు అందివ్వాలనుకుంటున్నాము. అందుకోసం మేము ఆర్ పిఎల్ ఆర్ ను తగ్గించాము' అని హెచ్ డిఎఫ్ సి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ తెలిపారు. ఈ ఆర్ పిఎల్ ఆర్ తగ్గింపు ఉనికిలో ఉన్న ఫోటింగ్ రేటు వినియోగదారులందరికి వర్తిస్తుంది. ఒక మూడు నెలల కాల వ్యవధిలో ఫోటింగ్ రేట్ల వినియోగదారుల రీసెట్ తేదీల కనుగుణంగా ఈ తగ్గింపు వర్తిస్తుందని అదికారులు తెలియజేశారు. నిర్వహణ సామర్ధ్యం పెరగడం, బాగా మెరుగైన పోర్టుఫోలియోల కారణంగా ఖర్చులు తగ్గిపోయాయని, అందువల్ల ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తున్నామని హెచ్ డిఎఫ్ సి అధికారులు తెలిపారు.
News Posted: 24 March, 2009
|