ఫ్రెషర్స్ కు సత్యం మెయల్
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ 9వేల మంది ఫ్రెషర్స్ నియామకాలను ఆ కంపెనీ వాయిదా వేసింది. ఆ మేరకు ఒక ఈ మెయిల్ సందేశాన్ని వారందరికి పంపింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వలన వాయిదా వేస్తున్నట్లు కంపెనీ వివరించింది. 2007-08 బ్యాచ్ విద్యార్ధులను 2007 డిసెంబర్ నుండి జూన్ 2008 మధ్య కాలంలో దాదాపు 9 వేల మందిని సత్యం కంపెనీ ఎంపిక చేసిందని కంపెనీ హెచ్ ఆర్ ఎస్ వి క్రిష్ణన్ తెలిపారు. కొద్ది కాలం క్రితం సత్యం కంపెనీకి చెందిన 9వేల మంది ఫ్రెషర్స్ ఒక యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు. తమను కంపెనీ రికార్డుల్లో ఉద్యోగులుగా గుర్తించాలని వారు కంపెనీని, ప్రభుత్వాన్ని అభ్యర్దించారు. సమ్మె చేసి నిరసన వ్యక్తం చేశారు. దానికి స్పందించిన సత్యం కంపెనీ ఫ్రెషర్స్ కు నియామకాల్ని వాయిదా వేస్తున్నట్లు సందేశం పంపింది.
News Posted: 24 March, 2009
|