మీ మొబైల్ ఒరిజినలేనా?
న్యూఢిల్లీ: గ్రే మార్కెట్ లో కొన్న మొబైల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. కంపెనీ వారెంటీ, గ్యారెంటీల్లేకుండా స్మగ్లింగ్ (దొంగ సరుకుల)బజారులో కొన్న మొబైల్స్ కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ నెంబరు (ఐఎమ్ఈఐ) ఉండదు. దాంతో ఇలాంటి మొబైల్స్ ను గుర్తించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు.స్కానర్స్ బారి నుండి తప్పించుకునేదందుకు ఉగ్రవాద సంస్థలు ఇలాంటి మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దాంతో దేశంలో ఉగ్రవాద కార్యకాలపలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం ఇలంటి ఫోన్లకు సర్వీసులను నిలిపివేయాలని ఒత్తిడి చేస్తోంది. దాంతో ఆయా మొబైల్ ఆపరేటర్లు ఇలాంటి ఐఎమ్ఈఐ నెంబరు లేని గ్రే మొబైల్స్ కు త్వరలో సర్వీసులు నిలిపివేసే అవకాశముంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్ (డిఓటి) ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లు ఇలాంటి చర్యలు చేపట్టారు.
అంతర్జాతీయంగా ఏ మొబైల్ నైనా సునాయాసంగా గుర్తించేందుకు 15 అంకెల సంఖ్యతో కూడిన ఐఎమ్ఈఐ కోడ్ తప్పనిసరి అవసరం. దొంగతనానికి గురైన హ్యాండ్ సెట్లను వినియోగించకుండా ఈ నెంబరు ద్వారా నిరోధించవచ్చు. ఒక నిర్ధిష్టమైన మొబైల్ పరికరం చట్టబద్దంగా వినియోగించగల్గే అవకాశముంటుంది. మొబైల్ ను వినియోగించిన ప్రతిసారి ఐఎమ్ఈఐ నెంబరు ఆపరేటర్స్ నెట్ వర్క్ లో కనపడుతుంది. కాల్స్ సరైన నికార్సైన హ్యాండ్ సెట్ల నుండి వస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు వీలుగా తమ నెట్ వర్క్ లకు ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (ఈఐఆర్) వ్యవస్ధలను ఏర్పాటు చేసుకోవలసిందిగా నెట్ వర్క్ ఆపరేటర్లను డిఓటి కోరింది.
ఈఐఆర్ వ్యవస్థలను 2009 మార్చి 31 లోగా ఏర్పాటు చేసుకోవాలని డిఓటి డెడ్ లైన్ పెట్టింది. ఐఎమ్ఈఐ నెంబరుగల మొబైల్ హ్యాండ్ సెట్లను వినియోగించాలని లేకపోతే సర్వీసులు నిలిపివేస్తామని ఇప్పటికే వినియోగదారులకు ఒక ప్రసిద్ధ సర్వీసు ప్రొవైడర్ ఎస్ ఎమ్ఎస్ సందేశాలను పంపుతోంది. ఐఎమ్ఈఐ నెంబరులేని మొబైల్ హ్యాండ్ సెట్లను దిగుమతి చేసుకోవడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ (ఐసి) ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్ర తెలిపారు.
News Posted: 26 March, 2009
|