10వేలకు చేరిన సెన్సెక్స్
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఆశావహంగా కొనసాగడంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. బిఎస్ఈ సెన్సెక్స్ మూడు శాతం అంటే 335.20 పాయింట్ల వృద్ధిని సాధించి 10,003.10 పాయింట్ల వద్ద నిలిచింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 97.90 పాయింట్ల లాభాన్ని పొంది 3,082.25పాయింట్ల వద్ద నిలిచింది. కేపిటల్ గూడ్స్ షేర్లను ఇన్వెస్టర్లు విపరీతంగా కొనుగోలు చేశారు. రియాల్టీ స్టాకులు లాభాల బాటలో నడిచాయి. ఎల్ అండ్ టి, బిహెచ్ ఈఎల్, స్టెర్లైట్, టిసిఎస్ స్టాక్ లు దాదాపు 6 శాతం వృద్ధిని సాధించాయి. సెన్సెక్స్ మూడు వారాల్లో దాదాపు 24 శాతం వృద్ది సాధించింది.
News Posted: 26 March, 2009
|