రాజుకు లై డిటెక్టర్ టెస్ట్
న్యూఢిల్లీ: సత్యం కుంభకోణం విషయాలను మాజీ చైర్మన్ రామలింగరాజు పూర్తిగా వెల్లడించాలేదని సిబిఐ గురువారంనాడు ప్రకటించింది. అందువల్ల రామలింగరాజుకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించవలసి ఉంటుందని సిబిఐ తెలిపింది. ఒక కంపెనీని స్థాపించిన వ్యక్తే ఫ్రాడ్ కు ఒడిగట్టడం అరుదైన విషయని సిబిఐ డైరెక్టర్ అశ్వనీ కుమార్ తెలిపారు.
'రాజు పూర్తి విషయాల్ని వెల్లడించలేదని మేము భావిస్తున్నాము. ఇది కార్పొరేట్ రంగంలోని ఘరానా మోసం. మోసం చేసిన వ్యక్తి ఇంత పెద్ద ఐటి సంస్థను స్థాపించి పోషించిన వ్యక్తి' అని కుమార్ తెలిపారు. సత్యం రాజుకు అతని సోదరుడు రామరాజు, మాజీ సిఎఫ్ఓ శ్రీనివాస్ లకు పాలీగ్రాప్ పరీక్షల్ని నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ హైదరాబాద్ స్థానిక కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాము. సిబిఐ స్వాధీనం చేసుకున్న సత్యం డాక్యుమెంట్ల ఆధారంగా దాదాపు 10 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సిబిఐ భావిస్తోందని కుమార్ తెలిపారు.
News Posted: 26 March, 2009
|