త్వరలో రిలయన్స్ గ్యాస్
ముంబై: గ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సంస్థ సర్వం సిద్ధం చేసుకుంది. 24-48 గంటల్లోపు సముద్ర గర్భం నుండి గ్యాస్ వెలికితీత కార్యక్రమం ప్రారంభకానుందని సన్నిహిత వర్గాలు సోమవారంనాడు తెలిపాయి.బంగాళా ఖాతం నుండి నెలకు 10 ఎమ్ఎమ్ఎస్ సిఎమ్ డిల గ్యాస్ ను ఉత్పత్తితో ప్రారంభించి, ఈ ఏడాది చివరినాటికి 80 ఎమ్ఎమ్ఎస్ సిఎమ్ డి ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని ఆర్ఐఎల్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పిఎమ్ఎస్ ప్రసాద్ శుక్రవారంనాడు తెలిపారు.
కృష్ణ గోదావరి (కెజి) బేసిన్ డి-6 బ్లాక్ లో గ్యాస్ ఉత్పత్తి అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు రిలయన్స్ కు అదనంగా 2 బిలియన్ డాలర్ల లాభం చేకూరుతుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ మధ్య నుండి డి-6 బ్లాక్ లో ఉత్పత్తిలో 15 ఎమ్ఎమ్ఎస్ సిఎమ్ డి ల గ్యాస్ ను అమ్మేందుకు 12 ఫెర్టిలైజర్ కంపెనీలతో శుక్రవారంనాడు రిలయన్స్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే.
News Posted: 30 March, 2009
|