సెన్సెక్స్ 4% పతనం
ముంబై: బ్యాంకింగ్, మెటల్స్, రియాల్టీ షేర్లు సోమవారంనాడు భారీగా అమ్మకాలు సాగడంతో భారత కీలక స్టాక్ మార్కెట్లు పతనమైనాయి. విస్తృత మార్కెట్లు నిరాశాజనకంగా సాగాయి. గ్లోబల్ సెల్-ఆఫ్ ప్రభావం మన మార్కెట్లపై పెద్దగా పడలేదని నిపుణుల అంచనా. బిఎస్ఈ సెన్సెక్స్ 480.35 పాయింట్లను కోల్పోయి 9568.14 పాయింట్ల వద్ద వచ్చి చేరింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఆశాజనకమైన వాతావరణంతో గత వారం సెన్సెక్స్ 12 శాతం పెరిగి, గత పన్నెండు ట్రేడింగ్ సెషన్స్ లో 23 శాతం లాభించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130.50 పాయింట్లు కోల్పోయి 2978.15 పాయింట్ల వద్ద నిలిచింది. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.56శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం పతనమైనాయి. బిఎస్ఈ బ్యాంకెక్స్ ఇండెక్స్ 8.41 శాతం, బిఎస్ఈ మెటల్ ఇండెక్స్ 7.40, బిఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 6.84 శాతం పతనమైనాయి.
News Posted: 30 March, 2009
|