ట్రాన్సాక్షన్ టాక్స్ రద్దు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ టాక్స్ (బిసిటిటి)ను ప్రభుత్వం బుధవారంనాడు ఉపసంహరించుకుంది. బ్యాంకుల నుండి డబ్బును డ్రా చేసుకుంటున్నందుకు ఇక మీదట పన్ను చెల్లించనక్కర్లేదు. బ్యాంకుల నుండి వ్యక్తులు ఒక రోజులో 50 వేల రూపాయలకు పైగా సొమ్మును డ్రా చేస్తే, అదే సంస్థలు ఒక లక్ష రూపాయలకు పైగా సొమ్మును డ్రా చేసినపుడు బిసిసిటి 0.1 శాతం పన్ను చెల్లించాలని 2005లో ప్రభుత్వం చట్టం చేసింది.
ఏప్రిల్ ఒకటి నుండి బ్యాకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ టాక్స్ ఏప్రిల్ 1 నుండి రద్దవుతున్నట్లు 2008-09 బడ్జెట్ ప్రసంగంలో ఆనాటి ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రకటించారు. బిసిటిటి విధానం వల్ల ఆదాయపు పన్ను శాఖకు ఆదాయలకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుందని ఆ బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం తెలిపారు. గత కొ్న్నేళ్ల నుండి సమాచారాన్ని సేకరించేందుకు పలు రకాల పద్దతులను ఆదాయ పన్ను శాఖ రూపొందించినట్లు ఆయన తెలిపారు. లెక్కల్లోకి రాని డబ్బును గుర్తించేందుకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ ను అమల్లోకి తెచ్చినట్లు చిదంబరం తెలిపారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశ్యంలో బిసిటిటిని అమలులోకి తేలేదని ఆయన తెలిపారు. 2008-09 మధ్యకాలంగ్లో కేవలం విదేశీ నిధుల ద్వారా కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే లభించినట్లు. 2007-08 ఆర్ధిక సంవత్సరంలో 550 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేయడం జరిగింది.
News Posted: 1 April, 2009
|