జోరుగా నానో బుకింగ్స్
హైదరాబాద్: చిన్న కారు టాటా నానో బుకింగ్‌లు మహా జోరుగా సాగుతున్నాయి.. బుకింగ్ ఈనెల 25తో ముగుస్తుందని టాటా అధి కార ప్రతినిధి తెలిపారు. బుకింగ్ లకు దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పంద న లభించిందని, బైకులు ఉపయో గించేవారు బుకింగ్‌లపై ఎక్కువ శ్రద్ధ చూపారని చెప్పారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన నానో దరఖా స్తుల అమ్మకాలకు మంచి స్పందన లభిస్తోందని, ఇది తమ కంపెనీకి చక్కని మద్దతుగా అభివర్ణించవచ్చని కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
టాటానానో వెబ్‌సైట్ ద్వారా రికార్డు స్థాయిలో 5 కోట్ల దరఖాస్తు ఫారాలు డౌన్‌లోడ్ అయ్యాయని వెల్లడించింది. దరఖాస్తు ఫారాలను దేశవ్యాప్తంగా వేయి నగరాల్లోని 30వేల ప్రాంతాల్లో విక్రయిం చినట్టు తెలిపింది. కంపెనీ డీలర్ షిప్‌స, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు, ఇతర ఫైనాన్షి యర్లు, వెస్‌టసైట్ అవుట్‌లెట్లు, క్రోమా, వరల్‌డ ఆఫ్ టైటాన్, టాటా ఇండికామ్‌లలో నానో దరఖాస్తులు లభ్యమవుతాయి. 18 బ్యాంకులు కంపెనీతో రుణ ఒప్పందంపై చేతులు కలిపాయి.
వివిధ బ్యాంకు ల్లో బుకింగ్ రూ.2,850 నుంచి రూ.4,110 మధ్య ఉంటుంది. అదే సమయంలో ఈ రుణానికి వడ్డీరేట్లు 9 శాతం నుంచి 14.25 శాతం మధ్య ఉండగా, ఇన్సురెన్స్ ప్రీమియంగా వినియోగదా రులు రూ.3,468-రూ.4,431 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు రూ.300లతో నానో దరఖాస్తు ఫామ్‌ను కొనుగోలు చేసి రూ.95,000 చెల్లింపు చేయాల్సి ఉంటుంది. లేనిచో బ్యాంకు ఫైనాన్‌స ద్వారా పొందాలనుకున్న ట్లయితే 2,999 రూపాయలను చెల్లించాలని కంపెనీ అధికారులు వెల్లడించారు.
News Posted: 11 April, 2009
|