డ్యూటీ రద్దుకు కమీషన్ ఓకె
న్యూఢిల్లీ: పంచదారపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ఉపా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల కమీషన్ ఆమోదించింది. దాంతో ఉపా ప్రభుత్వ కీర్తి కిరీటంలో మరో కలికితూరాయి వచ్చినట్లవుతుంది. ఈ చర్యతో స్థానిక పంచదార ధరలు బాగా తగ్గిపోతాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన సమయంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మాత్రమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించవలసి ఉంటుంది. ఎమ్ఎమ్ టిసి, ఎస్ టిసి, పిఈసి, అగ్రి కోపరేటివ్ నాఫెడ్ ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థల ద్వారా ఆగష్టు నాటికి 10 లక్షల టన్నుల శుద్ది చేసిన పంచదారను దిగుమతి సుంకం లేకుండా దిగుమతి చేసుకోవాలని ఏప్రిల్ 9న కేబినెట్ నిర్ణయించింది. పంచదార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచదార దిగుమతిపై విధించే 60 శాతం సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు త్వరలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించనుంది.
News Posted: 14 April, 2009
|