సత్యం సేల్ కు సిఎల్బీ ఓకె
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ సంస్థను టెక్ మహీంద్ర కొనుగోలు వ్యవహారాన్ని కంపెనీ లా బోర్డు (సిఎల్ బి) ఆమోదించింది. గతంలో సత్యం కంపెనీకి చెందిన 31శాతం షేర్లను టెక్ మహీంద్రకు అమ్మేందుకు సిఎల్ బి అనమతి కోసం అభ్యర్ధించిన విషయం తెలిసిందే. టెక్ మహీంద్ర సంస్థ నుండి మరో నలుగురు డైరెక్టర్లను సత్యం కంప్యూటర్స్ బోర్డులోకి తీసుకునేందుక సిఎల్ బి అనుమతించింది. అదే సమయంలో సత్యం ఖాతాను రూపొందించేందుకు మరింత గడువును సత్యం బోర్డు కోరింది. సత్యం బోర్డు పై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఇక మీదట టెక్ మహీంద్ర సంస్థకు వస్తుందని సత్యం కంపెనీ చైర్మన్ కిరణ్ కార్నిక్ తెలిపారు. అయితే ఇప్పటివరకు టెక్ మహీంద్ర ఎలాంటి సమాచారం రాలేదని ఆయన తెలిపారు.
సత్యం కొనుగోలు వ్యవహార వేగంగా జరడంపై కార్నిక్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలివున్న ఫలితాలన్నిటితో సహా సత్యం కంపెనీ తన ఫలితాల నివేదికను డిసెంబర్ 31లోగా ప్రకటించవలసి ఉంటుందని సిఎల్ బి తెలిపింది.సత్యం బోర్డులో నలుగురు కంటే ఎక్కువ సభ్యులను టెక్ మహీంద్ర నియమించరాదని సిఎల్ బి తెలిపింది. ఏప్రిల్ 21 నాటికి సత్యం ఖాతాలో 1,756 కోట్ల రూపాయలను టెక్ మహీంద్ర డిపాజిట్ చేయవలసి ఉంటుందని సిఎల్ బి వెల్లడించింది.
News Posted: 16 April, 2009
|