'ఏడ్చే అనాథ'కు అండ
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ సంస్థను 'ఏడ్చే అనాథ' గా కంపెనీ లా బోర్డు (సిఎల్ బి) గురువారంనాడు అభివర్ణించింది. ఈ అనాథ ఆలనా పాలన ఇక మీదట నుంచి టెక్ మహీంద్ర అనుబంధ సంస్థ 'వెచర్ బే' చూసుకోవలసి ఉంటుందని సిఎల్ బి తెలిపింది. సత్యం మాజీ చైర్మన్ రామలింగ రాజు 7,800 కోట్ల రూపాయల అకౌంటింగ్ స్కాంను జనవరి 7న ప్రకటించి కంపెనీ నుండి వైదొలగినప్పటి నుండి ఆ సంస్థ ఒక అనాథగా మారిందని సిఎల్ బి చైర్మన్ ఎస్ సుబ్రమణ్యం అన్నారు. అలాంటి సంస్థను కొనుగోలు చేసేందుకు టెక్ మహీంద్ర సంస్థకు అనుమతిస్తున్నట్లు సిఎల్ బి ఆదేశాలను జారీ చేసింది.సత్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నియమించిన బోర్డు సమర్ధుడైన వ్యూహాత్మక మదుపుదారును ఎంపిక చేయడంలో వ్యవహరించిన తీరును సిఎల్ బి ప్రశంసించింది.
News Posted: 16 April, 2009
|