1200 కోట్లతో అపోలో విస్తరణ
హైదరాబాద్: అపోలో హెల్త్ గ్రూప్ సీటీ 1200 కోట్ల రూపాయలతో భారీ విస్తరణ ప్రణా ళికలను ప్రకటించింది. 2011 నాటికి హైదరాబాద్, చెన్నయ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 1800 అదనపు పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అపోలో హాస్పటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై రూ. 520 కోట్లు వెచ్చించామని చెప్పారు. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 11 ప్రాజెక్టు ల నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎల్ అండ్ టి, షాపూర్ ఫాలోంజీ చేపడుతున్నాయని అన్నారు. మరో రెండు రోజుల్లో అపోలో హెల్త్ సీటీలో 200 పడకల సామర్థ్యాంతో అల్ట్రాబెడ్స్ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు ప్రతాప్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో విశాఖ, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఆపోలో ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, వీటికి సంబంధించిన భూసేకరణ పనులు చేపడుతున్నామని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. విస్తరణ ప్రాజెక్టుల నిమిత్తం తమ సంస్థ ఐఎఫ్‌సి నుంచి 50 మిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుందని అన్నారు.
ఆర్థిక మాంద్యంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిందని, ఆరోగ్య సేవల రంగం పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్, వాటి అనుబంధ సంస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాలని అన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు, తక్కువ వడ్దీకి రుణాలు అందుబాటులోకి లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూన్న ఆరోగ్య సేవల రంగాన్ని పరిశ్రమ హోదా ఇవ్వడానికి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందకు రావడంలేదని, ఈరంగంపై మరింత దృష్టి సారిస్తే ఏటా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. విదేశాల్లోనూ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది తదితరలు వారి నైపుణ్యంతో దేశానికి విదేశీమారకాన్ని అందిస్తున్నారని రెడ్డి తెలిపారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం పిపిపి, ప్రైవేట్ రంగంలో వైద్య సేవలను మరింతగా పోత్స్రహించాలని అన్నారు.
క్యాన్సర్ ట్యూమర్‌కు నోవాలిస్ టిఎక్స్ రేడియోషన్ మిషన్‌తో మెరుగైన ఫలితాలు పొందవచ్చునని, ఈ విధమైన అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన చికిత్సా విధానం ప్రపంచంలో చాల అరుదుగా లభిస్తున్నదని ప్రతాప్ రెడ్డి తెలిపారు. గతంలో క్యాన్సర్‌కు రేడియోషన్ థెరపీ అందుబాటులో ఉన్నప్పటికీ, అమలు చేసిన తీరుతో రోగి కొన్ని సమస్యలు ఎదుర్కొకతప్పలేదు. తాజాగా నోవాలిస్ టిఎక్స్ రేడియోషన్ థెరపీ, రేడియో సర్జరీలో ట్యూమర్‌కు మాత్రమే రేడియోషన్ చేరుతుందని, దీంతో సైడ్‌ఎఫెక్స్‌టను పూర్తిగా నిరోధించవచ్చునని రెడ్డి వెల్లడించారు. ఈతరహా టెక్నాలజీని ఆపోలో హెల్త్ సిటీలో రూ. 150 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశామని అన్నారు.
News Posted: 5 June, 2009
|