మళ్ళీ మాంటెక్ సింగ్‌కే పగ్గాలు
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే మన్మోహన్ సింగ్ సర్కార్ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా తిరిగి మాంటెక్ అహ్లూవాలియాను నియ మించింది. శుక్రవారం ప్రణాళికా సంఘం పునః నిర్మాణంలో భాగం గా ప్రధాన మంత్రి కార్యాలయం అ హ్లూవాలియా నియామకాన్ని ప్రక టిస్తూ, కొత్తగా ప్రణాళిక సంఘం లో ముగ్గురు సభ్యులకు అవకాశం కల్పించింది. ఈ ముగ్గురిలో గతంలో ప్రధానమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్యానల్‌లో పనిచేసిన సుమిత్రా చౌదరికి కూడా అవకాశం లభించింది.
మిగతా ఇద్దరిలో పునే యూనివర్సిటీ వైఎస్ ఛాన్సులర్ జాదవ్, సమాజ్ ప్రగతి సహయోగ్ కార్యదర్శి మిహిర్ షా ఉన్నారు. అంతేకాకుండా ప్రణాళిక సంఘం సభ్యులుగా అభిజిత్ సేన్, సయ్యద్ హామీద్, బికె చతుర్వేదీలను ప్రణాళిక సంఘంలో అదే స్థానాల్లో నియమించినట్లు పిఎమ్‌ఓ వర్గాలు తెలిపాయి. ప్రణాళిక సంఘంలో గతంలో పనిచేసి ప్రస్తుతం పునరుద్దరణలో కిరీట్ పారీఖ్, విఎల్ చోప్రా, బి మునిగర్, బిఎన్ యుగంధర్ పేర్లు పిఎమ్‌ఓ ప్రకటించిన పేర్లలో లేవు. ఇదిలా ఉండగా సదరు సభ్యులు మాత్రం ప్రధాన మంత్రి తమకు తిరిగి ప్రణాళిక సంఘం సభ్యులుగా నియమిస్తారని బలంగా ఆశిస్తున్నారని తెలుస్తున్నది. గత ప్రభుత్వంలోనే ప్రణాళిక సంఘం కాల పరిమితి పూర్తి కావడంతో డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ అహ్లూవాలియా, ఇతర సభ్యులుగా తమ పదువుకలు రాజీనామ చేసిన విషయం తెలిసిందే.
News Posted: 5 June, 2009
|