బడ్జెట్ పై పెదవి విరుపు
హైదరాబాద్:బడ్జెట్ పారిశ్రామిక వర్గాలు ఆశించినంతగా లేదు. ద్రవోల్బణం, ఆర్ధిక మందగమన పరిస్థితుల్లో ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, ఆదాయ పన్ను పరిమితి పెంపులపై ఈ వర్గాలు పెట్టుకున్నఅంచనాలన్నీ తారుమారయ్యాయి. దీంతో లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్, బడ్జెట్ స్వరూపం తెలుస్తున్న కొద్దీ పతన దిశలో కూరుకు పోయింది. సెన్సెక్స్ 870, నిఫ్టీ 350 పాయింట్లు పడిపోవడం ఈ భారీ ఆశలు తల్లకిందులవడాన్నే సూచిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు.
కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు, ప్రభుత్వ ఉద్దేశాలు మాత్రం బాగున్నాయి. అయితే వీటి అమలు ఏ విధంగా సాధ్యమనే నిర్దుష్టమైన విధానాలు స్పష్టం చేయకపోవడం ప్రధానమైన లోటు. మౌలిక వసతుల రంగానికి కేటాయిం పులు భారీ గా పెంచడం శుభపరిణామమే. ఆదాయ పన్ను మినహాయింపు ఆశించిన స్థాయిలో పెరగక పోవడం మధ్యతరగతి, చిన్న వ్యాపారులలో నిరాశను కలిగించింది. పరిశ్రమ వర్గాల్లో ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి. అందుకే సెన్సెక్స్ భారీగా పతనమైంది. దీనిని బట్టి ఈసారి కేంద్ర బడ్జెట్ ఆశించినంత స్థాయిలో లేదనే చెప్పాలి.
News Posted: 7 July, 2009
|