చేతులు కలపండి బ్రదర్స్!
న్యూఢిల్లీ : అంబానీ సోదరుల మధ్య కొనసాగుతున్న గ్యాస్ సరఫరా వివాదంకు పరిష్కార మార్గం రాజీపడడమేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రెండు గ్రూప్ కంపెనీల స్టాక్ ధరల ప్రభావం ఇన్వెస్టర్లకు ధడ పుట్టిస్తోందని వారన్నారు. అంబానీల సోదరుల మధ్య గ్యాస్ సరఫరా వివాదం విసుగును తెప్పిస్తున్న తరుణంలో రాజీపడడమే సరైన పరిష్కార మార్గమని అంతర్జాతీయ విశ్లేషణ వ్యాపార సంస్థ సీఎల్‌ఎస్‌ఎ తెలిపింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని సంస్థ ఆర్‌ఎన్‌ఆర్, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఇరువురు క్రాస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్థారించిన దాని కంటే 44 శాతం తక్కువ ధరకు ఎమ్‌ఎమ్‌బిటీయుకు 2.3 డాలర్ల గ్యాస్‌ను తక్షణమే అమలు చేయాలని ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ కోరుతోంది. దీనికి ప్రభుత్వం సమ్మతించకుండా ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు గ్యాస్ సరఫరా చేయబోమని ఆర్‌ఐఎల్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు రోజురోజుకీ పెరుగుతుండగా, దీర్ఘకాలిక ఒప్పందం ధరల కంటే అంతర్జాతీయ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
శుక్రవారంనాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ 10 శాతంకు పైగా పెరిగింది. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ (ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్) స్టాక్ వారంవో 22 శాతం పెరిగింది. రెండు వర్గాల వైపు నుంచి గ్యాస్ ధరపై రాజీ ఏర్పడితేగానీ పరిస్థితులు కుదుటపడవని, ఇది ప్రభుత్వానికి కష్టమైన విషయమని ఢిల్లీకి చెందిన పర్ప్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారు సీఈఓ పి.కె.అగర్వాల్ అన్నారు. ఇద్దరి మధ్య గ్యాస్ సరఫరా వివాదం కారణంగా ఇన్వెస్టర్లకు ఎలాంటి ఫలితాలు వచ్చాయే గమనించవచ్చని ఆయన అన్నారు. రాజీపడడం వల్ల దాద్రి((7,480 మెగావాట్ల), షాహపూర్(2,800 మెగావాట్ల) పురోగతి తోడ్పడినట్లవుతుందని, ప్రస్తుతం ఇవి అనిశ్చితి స్థితిలో ఉన్నాయని సీఎల్‌ఎస్‌ఎ తెలిపింది. వీరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లయితే ఆ ప్రభావం రెండు కంపెనీల వాటాలపై పడుతుందని, ఇద్దరు సోదరులు రాజీ దిశగా వస్తే పరిష్కార మార్గం సాధ్యమయ్యే అవకాశం ఉందని మరో బ్రోకరేజ్ వ్యాపార సంస్థ విశ్లేషకుడు తెలిపారు.
News Posted: 20 July, 2009
|