హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో నగరంలోని ఐటిసి కాకతీయ హౌటల్ '2009 - గోల్డెన్ పీకాక్ అవార్డు'ను గెలుచుకుంది. భారత జాతీయపక్షి 'నెమలి' పేరు మీద ఏర్పాటు చేసిన గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ అవార్డును ప్రతి సంవత్సరం అందజేస్తుంది. గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తాము ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టం కావడమే కాకుండా తమ హొటల్ కు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లయిందని హొటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. గోల్డెన్ పీకాక్ అవార్డును 'ప్రపంచ పర్యావరణ ఫౌండేషన్' (డబ్ల్యు ఇ ఎఫ్) సంస్థ 1998లో ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చక్కగా కృషి చేస్తున్న సంస్థలకు ఈ అవార్డును అప్పటి నుంచీ అందజేస్తున్నారు.