'చిట్' డిపాజిట్లపై నిషేధం
ముంబై : దేశంలోని చిట్ ఫండ్ సంస్థలన్నీ డిపాజిట్ల స్వీకరణను తక్షణమే నిలిపివేయాలని రిజర్ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఆదేశించింది. దేశంలో రుణ వ్యవస్థను నియంత్రించడానికి ఈ చర్య వల్ల బ్యాంకులకు వీలు కలుగుతుందని బ్యాంకింగ్ రెగ్యులేటర్ తెలియ.జేసింది. అంటే దేశంలో ఇప్పుడున్న పది వేల చిట్ ఫండ్ సంస్థలకు ఇది మరణ మృదంగం అన్న మాట.
'ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇది అవసరమని, దేఓశంలో రుణ వ్యవస్థను నియంత్రించడానికి బ్యాంకులకు అవకాశం కల్పించవలసి ఉందని భావించినందున వాటాదారుల నుంచి తప్ప ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రకరకాల బ్యాంకింగేతర సంస్థ (ఎంఎన్ బిసి)లను తక్షణమే నిషేధించడమైనది' అని ఆర్ బిఐ శుక్రవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ లో పేర్కొన్నది.
చిట్ అంటే కార్బొరేట్ వ్యవహారల మంత్రిత్వశాఖ వెబ్ సైట్ ప్రకారం, దేశంలో రిజిస్టరైన చిట్ ఫండ్ సంస్థలు సుమారు 9909 ఉన్నాయి. నిర్దుష్ట సంఖ్యలో చందాదారులతో సంస్థ ప్రమోటర్ ఒక ఒప్పందం కుదుర్చుకొనడానికి వీలు కల్పించే లావాదేవీ అని అర్థం. దీని ప్రకారం, ప్రతి ఒక్క చందాదారుడు నిర్దుష్ట వ్యవధి కోసం కొంత మొత్తాన్ని చందా కడతారు. ప్రతి ఒక్క చందాదారుడు లాట్ రూపేణా లేదా వేలం పాట ద్వారా తన వంతు వచ్చినప్పుడు నగదు బహుమతికి అర్హుడవుతారు.
ఆర్ బిఐ సమాచారం ప్రకారం, తన వాటాదారులు కాని వారి నుంచి ఈ ఎంఎన్ బిసిలు వసూలు చేసి, దగ్గర అట్టిపెట్టుకున్న ఏ డిపాజిట్ నైనా దాని గడువు ముగియగానే తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఈ డిపాజిట్లను ఆ గడువు తరువాత రెన్యూ చేయరాదని ఆర్ బిఐ స్పష్టం చేసింది.
News Posted: 29 August, 2009
|