హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన ప్రవాస భారతీయులు అల్కాజ్ ఖమీజ్ ఒబాయిద్ ఖమీజ్ నుంచి 2.30 కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నకేసులో 10 నమూనా నోట్లను తమకు ఇప్పించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐసీ) కోరింది. ఈ మేరకు నాంపల్లిలోని నాల్గో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు చెందిన ఖమీజ్ నుంచి నకిలీ కరెన్సీని 2007 ఆగస్టు 25న హైదరాబాద్ లోఅధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నెల క్రితం ముంబైలో ఆరుగురి వద్ద పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని పట్టుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎన్ ఐసీ అధికారులు హైదరాబాద్ లో మకాం వేసి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.